Share News

కుట్రలో భాగంగానే గాంధీ పేరు తొలగింపు

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:24 PM

దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో భాగంగానే ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించారని జోగుళాంబ గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అన్నారు.

కుట్రలో భాగంగానే గాంధీ పేరు తొలగింపు
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి

  • గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి

గద్వాల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో భాగంగానే ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించారని జోగుళాంబ గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనా విధానాన్ని బీజే పీ అమలు చేస్తున్నదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుందన్నారు. ఉ పాధి హామీ పథకం మహాత్మాగాంధీ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ చట్టంచేసి అమలు చేస్తే దానిని మార్చేశారని మండిపడ్డారు. 100రోజుల పని ఇప్పుడు 75రోజులకు తగ్గిపోయిందన్నారు. కేం ద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరించాలని కండిషన్‌ పెట్టిందని, దీనిని బట్టి చూస్తే కేం ద్రంపై భారం తగ్గించుకున్నట్లేనని అన్నారు. ప నులు కూడా గ్రామానికి అనుకూలంగా కాకుం డా కేంద్రం చెప్పిన పనులే చేయాల్సి ఉంటుంద న్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర కాంగ్రెస్‌పార్టీ ఉన్నంత వరకు జరగని పని అన్నారు. ఈ నెల 20నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో నిరస న కార్యక్రమాలు చేపడతామన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:24 PM