Share News

ఎర్రజెండాకు మరణం లేదు

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:12 PM

బాఽధలు లేని సమాజ నిర్మా ణమే ఎర్రజెండా లక్ష్యమని, కమ్యూనిజానికి మరణమే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్త గూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

ఎర్రజెండాకు మరణం లేదు
సంస్మరణ సభలో మాట్లాడుతున్న కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు

ఆత్మకూరు/ అమరచింత, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : బాఽధలు లేని సమాజ నిర్మా ణమే ఎర్రజెండా లక్ష్యమని, కమ్యూనిజానికి మరణమే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్త గూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వనపర్తి జిల్లా కార్యదర్శి విజయ రాములు సతీమణి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అ లుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్న విజ యరాములు జీవిత సహచరి జ్యోతి మరణం అత్యంత బాధాకరమన్నారు. ఆమెలేని లోటు తీర్చలేనిదని కమ్యూనిస్టు త్యాగాలకు చిరస్మర ణీయురాలని పేర్కొన్నారు.

కమ్యూనిజం అజయమైనది: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

కమ్యూనిస్టుగా జీవించాలంటే ధైర్యం కావా లని కమ్యూనిస్టు శ్రేణులు విప్లవ సైనికులు గా దోపిడీ వర్గాలపై కవాతు నిర్వహించాల న్నారు. సభా ప్రాంగణంలో ఆయన ఆటపాట లతో సభా ప్రాంగణాన్ని ఉత్తేజింపజేశారు. క మ్యూనిస్టుల మరణానికి వెనుకాడరని, బడు గు బలహీన వర్గాల కోసం అలుపెరుగని పో రాటాలు చేస్తూనే ఉంటారని, వారి మర ణాలు చరిత్రలో లిఖించబడుతాయని గుర్తు చేశారు.

ఉత్తమ విలువల జీవితం కమ్యూనిస్టులకే సాధ్యం: ప్రొఫెసర్‌ కాసీం

ఉత్తమ విలువలతో కూడిన జీవితం క మ్యూనిస్టులకే సాధ్యమవుతుందని ఉస్మాని యా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కాసీం అన్నా రు. నేటి సమాజంలలో రాజకీయాలే కాకుం డా సకల వస్తువులు కూడా కల్తీమయంగా మారాయని, మారుతున్న సమాజంలో మా నవుని ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిం దన్నారు. విజయరాములు విలువలకు భౌతిక వాద సిద్ధాంతానికి నిటారుగా నిలబడి మత చాందస్తు వాద సంస్కృతికి వ్యతిరేకంగా జీ వించిన వ్యక్తి అని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలన రసింహ, బోస్‌, ఎండి.యూసుఫ్‌, నరసింహ, వార్ల వెంకటయ్య, ఫయాజ్‌, ఆంజనేయులు, నరసింహ, ఆత్మకూరు, అమరచింత సీపీఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 11:12 PM