సృజనాత్మకతను వెలికితీసేందుకే ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:27 PM
విద్యార్ధుల మానసిక ఆనందాన్ని పెంపొందించడానికి, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా సంక్షేమాధికారి నుషిత తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా సంక్షేమాధికారి నుషిత
గద్వాల న్యూటౌన్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధుల మానసిక ఆనందాన్ని పెంపొందించడానికి, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా సంక్షేమాధికారి నుషిత తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో శుక్రవారం విద్యార్థినుల కు ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమశాఖ ఆధికారి నుషిత హాజరై వి ద్యార్థులు వేసిన ముగ్గులను పరిశీలించారు. వార్డెన్ సుజాతను అభినందించారు. అనంతరం గె లుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ బాలికల వసతిగృహ వార్డెన్ సుజాత, ఇతర వార్డెన్‌లు ప్రమీళ, రామకృష్ణ, సాయిసౌజన్య, పద్మ, విద్యార్థులు ఉన్నారు.