కనుల పండువగా వేంకటేశ్వరుడి శోభాయాత్ర
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:13 PM
కొ ల్లాపూర్ పట్టణంలోని బండయ్యగుట్ట వేంకటే శ్వర స్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహా లతో రథోత్సవం బయలుదేరి కొల్లాపూర్ పట్టణ పుర వీధుల గుండా కొనసాగింది. రథోత్సవం లో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక పురా వస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజర య్యారు.
- రథోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి
- బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో యువకుల బైక్ ర్యాలీ
కొల్లాపూర్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : కొ ల్లాపూర్ పట్టణంలోని బండయ్యగుట్ట వేంకటే శ్వర స్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహా లతో రథోత్సవం బయలుదేరి కొల్లాపూర్ పట్టణ పుర వీధుల గుండా కొనసాగింది. రథోత్సవం లో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక పురా వస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజర య్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. శోభాయాత్రలో మహిళలు చిన్నారు లు కోలాటాలు వేస్తూ నృత్యాలు చేస్తూ యువకులు బాణాసంచా కాల్చుతూ రథోత్సవం లో పాల్గొన్నారు. అదే విధంగా కొల్లాపూర్ పట్టణంలోని రామ మందిరం ఆలయం నుంచి గోదా రంగనాయక స్వామి ఉత్సవ విగ్రహాలను రథోత్సవంపై ఉంచి ఆ లయం నుంచి బయ లుదేరి పట్టణ పురవీ ధుల గుండా ర్యాలీ ని ర్వహించారు. ర్యాలీ లో ఒంటెలపై యువ కులు కాషాయపు జెం డాలతో పాల్గొనడం ప లువురిని ఆకట్టుకుం ది. కొల్లాపూర్ మాధ వ స్వామి దేవాల యం నుంచి ఉత్సవ విగ్రహాలను రథోత్స వంపై ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరే గింపు నిర్వహించారు. భాజా భజంత్రీలతో భక్తి శ్రద్ధలతో ఉత్సవ వి గ్రహాలను రథోత్సవంపై ఉంచి పట్టణ ప్రాం తాల్లో ఊరేగింపు కొనసాగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ఉ త్సవ విగ్రహాల కు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో యువకులు పట్టణ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి సంక్రాంతి వేడు కల్లో భాగంగా కాషాయపు జెండాలతో ర్యాలీ కొనసాగించారు. నాయకులు, యువకులు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.