ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:06 PM
విద్యుత్ శాఖలో పనిచే స్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తే లేదని విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ జోగుళాంబ గద్వాల జిల్లా చైర్మన్ శివప్రసాద్ అన్నారు.
విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ జిల్లా చైర్మన్ శివప్రసాద్
గద్వాల అర్బన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖలో పనిచే స్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తే లేదని విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ జోగుళాంబ గద్వాల జిల్లా చైర్మన్ శివప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజన్ ఇంజనీ రింగ్ కార్యాలయం ఎదుట కొనసాగు తున్న విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక ముందు అప్పటి శాసనసభపక్ష నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేప ట్టిన పాదయాత్రలో మాది ప్రజా ప్రభుత్వం, అధికారంలోని రాగానే ఆర్టిజన్ ఉద్యోగుల సమ స్యలు కచ్చితంగా పరిష్కరిస్తామన్న ఉప ము ఖ్యమంత్రి రెండేళ్లు గడుస్తున్నా విద్యుత్ ఉద్యో గుల సమస్యలను పరిష్కరించకుండా విస్మరిస్తు న్నారని మండిపడ్డారు. సంస్థలో 23 మంది ఆ ర్టిజన్ ఉద్యోగులకు స్టాండింగ్ ఆర్డర్స్‌ను రద్దు చేసి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తమకు ఏపీ ఎస్‌ఈబీ రూల్స్‌ను అమలు చేయాలని, విద్యా ర్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, 2016 నుంచి మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తిం చి తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఆ ర్టిజన్ కార్మికులు చేస్తున్న రెండవ రోజు సమ్మె కు సీఐటీయూ నాయకులు, టీఈఈ 1104 యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ పరమాల రాజు, కన్వీనర్ రఫి, కోచైర్మన్ క్రాంతి, రామకృష్ణ, సతీష్, శ్రీనివాసులు, రవి, నరేందర్, అనంతరెడ్డి, కుమార్, రాఘవేంద్ర, ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు.