గద్వాల మునిసిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:25 PM
గద్వాల మునిసిపాలిటీలో మళ్లీ బీఆర్‌ఎ స్ జెండా ఎగరవేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
గత ప్రభుత్వంలోనే గద్వాల పట్టణంలో అభివృద్ధి
బీఎస్ కేశవ్‌తో సమావేశమైన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గద్వాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): గద్వాల మునిసిపాలిటీలో మళ్లీ బీఆర్‌ఎ స్ జెండా ఎగరవేయాలి.. కేసీఆర్ ప్రభుత్వంలో బీఎస్ కేశవ్ ఆధ్వర్యంలో గద్వా ల పట్టణం అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువా రం గద్వాలకు వచ్చిన శ్రీనివాస్‌గౌడ్ మాజీ మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ఇంటికి వెళ్లి మునిసిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అం శాలపై చర్చించారు. గత ప్రభుత్వంలోనే గద్వా ల పట్టణం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చి రెండేళ్లు అయినా ఇప్పటివరకు పట్టణంలో పది రూపాయల అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ను నెరవేర్చలేదని విమర్శించారు. వార్డులలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చే యాలని సూచించారు. గట్టు, నెట్టంపాడు ప్రాజె క్టు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. జూ రాల కింద రైతులకు సాగునీరు అందించకుం డా క్రాఫ్ హాలీ డే ప్రకటించిందని విమర్శించా రు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పారు.