పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:49 PM
పదవీ విరమణ పొందే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని తెలంగాణ టీచర్చ్ యూనియన్(టీటీయూ) జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న కోరారు.
టీటీయూ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న
గద్వాల టౌన్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ పొందే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని తెలంగాణ టీచర్చ్ యూనియన్(టీటీయూ) జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న కోరారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. గద్వాలలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశం అనంతరం బుచ్చన్న విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.60 లక్షల మంది సీపీ ఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంతో సామాజిక భద్రత కల్పించాలన్నారు. జీవో నెం.317కు అనుబంధంగా జారీ చేసిన జీవో నెం.190ను ఉపాధ్యాయులకు వర్తింపజేసి సర్వీ స్ రూల్స్‌ను నవీకరించి న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి డిమాండ్ల పరిష్కారంపై సానుకూల స్పందన లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడికొండ ఈశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండాపురం ప్రతాప్, పాల్వాయి లక్ష్మీ నారాయణ, నాయకులు ఎండీ మెహబూబ్ బా షా, గజేంద్ర ఉన్నారు.