Share News

దుమ్మురేగుతున్న పెద్దరేవల్లి రోడ్డు

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:09 PM

బాలానగర్‌ మండల కేంద్రం నుంచి పెద్దరేవల్లి మీదుగా గంగాపూర్‌ వరకు నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి.

దుమ్మురేగుతున్న పెద్దరేవల్లి రోడ్డు
వాహనాల రాకపోకలతో దుమ్ము రేగుతున్న రహదారి

బాలానగర్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : బాలానగర్‌ మండల కేంద్రం నుంచి పెద్దరేవల్లి మీదుగా గంగాపూర్‌ వరకు నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. కంకర వేసి వదిలేయడం, దీనికి తోడు అటుగా ఉన్న పరిశ్రమలు, క్రషర్‌ పరిశ్రమల టిప్పర్లు రాకపోకలు సాగించడంతో దుమ్ముదూళితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారులు కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు అనేకం. అంతేకాకుండా దుమ్ముదూళితో శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నామని పెద్దరేవల్లి, చిన్నరేవళ్లి, మొదంపల్లి, అప్పాజిపల్లి, నేలబండతండా, హేమాజీపూర్‌, బోడజానంపేట, గౌతాపూర్‌ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, పాలకులు స్పందించి రోడ్లపై నీటి పిచికారి చేయించాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు సాధ్యమైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:09 PM