దారిపొడవునా బురదమయం
ABN , Publish Date - May 27 , 2026 | 11:41 PM
అలంపూర్ చౌరస్తాలోని అలంపూర్ వెళ్లే రోడ్డు బురదమయంగా మారింది.
అలంపూర్ చౌరస్తాలో రోడ్డుపైనే నిలుస్తున్న వర్షపు నీరు
అలంపూరుచౌరస్తా, మే 27 (ఆంధ్రజ్యోతి): అలంపూర్ చౌరస్తాలోని అలంపూర్ వెళ్లే రోడ్డు బురదమయంగా మారింది. రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులంతా ఈ కూడలి గుండా వెళ్తారు. చిన్నపా టి వర్షానికే రోడ్డు మురుగుకుంటను తలపిస్తుం ది. అలంపూరు వైపు, అటు అయిజ వైపు వెళ్లే దారుల్లో డ్రైనేజీ, ఫుట్‌పాత్‌లను ఇక్కడి వ్యాపారులు ఆక్రమించారు. దీంతో రోడ్డు కుచించుకు పోయింది. నిన్న, మొన్న కురిసిన వర్షాలకు పూర్తిగా బురదమయంగా మారి వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. దీనికితోడు దుర్గంధం వెదజల్లుతున్నది. అధికారులు సారించి సమ స్యను పరిష్కరించాలని భక్తులు, వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.