ఎస్సీ వర్గాల అభ్యున్నతికి పార్టీ కృషి
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:26 PM
ఎస్సీ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ అన్నారు.
వనపర్తి టౌన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ అన్నారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో 34 మం దితో కూడిన జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ కమిటీని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆశ యాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా కార్యకర్తలు కృషి చేయా లన్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాలు ఎదుర్కొం టున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండాలని ది శానిర్దేశం చేశారు. కమిటీలో చోటు దక్కించుకు న్న ప్రతీ ఒక్కరూ తమకు అప్పగించిన బా ధ్యతలను పదవులుగా కాకుండా పార్టీకి సేవ చేసే అవకాశంగా భావించాలని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో గంధం రాజశేఖర్, కోళ్ల వెంకటేశ్, గంధం శరవంద, కొమ్ము వెంకటేశ్, శ్రీకాంత్, అనిల్, గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.