Share News

భూసేకరణలో వేగం పెంచాలి

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:48 PM

జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసు కుంటామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు.

 భూసేకరణలో వేగం పెంచాలి
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 21 (ఆంరఽధజ్యోతి) : జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసు కుంటామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు. రా ష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండిం గ్‌ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌బీ పనుల పురోగతిపై సోమవారం కలెక్టర్లతో మంత్రులు ఉత్త మ్‌ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజులు వీసీ నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌, జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్‌ చంద్ర, అదనపు కలెక్టర్‌ చెన్నయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టుల వారీగా భూసేకరణ పురోగతి, పెండింగ్‌లో ఉన్న భూములు, పరి హారం చెల్లింపుల స్థితిగతులను ఎప్పటిప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూసేకరణకు సం బంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్క రించే దిశగా జిల్లాయంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించి నట్లు తెలిపారు. వీసీలో భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మాధవి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ నారాయణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:48 PM