Share News

ఒకే ఒక్కడు

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:23 PM

నాగర్‌ కర్నూలు జిల్లా పరిధిలోని మన్ననూరు ఇంటి గ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐటీ డీఏ)లో 12ఏళ్లుగా రెగ్యులర్‌ పీవోను నియ మించలేదు.

ఒకే ఒక్కడు
ఐటీ డీఏ

- ఒక్క ఉద్యోగితోనే నెట్టుకొస్తున్న

మన్ననూరు ఐటీడీఏ

- 12 ఏళ్లుగా ఇన్‌చార్జి అధికారులే దిక్కు

- చెంచులకు అందని ప్రభుత్వ పథకాలు

మన్ననూర్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి):నాగర్‌ కర్నూలు జిల్లా పరిధిలోని మన్ననూరు ఇంటి గ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐటీ డీఏ)లో 12ఏళ్లుగా రెగ్యులర్‌ పీవోను నియ మించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీ లోని కర్నూలు జిల్లా సున్నిపెంట నుంచి ఐటీ డీఏను వేరుచేసి మన్ననూరు మాడా కార్యా లయ భవనంలోనికి మార్చారు. కానీ నల్లమ ల ప్రాంతంలోని చెంచులకు ఏమాత్రం ఉప యోగపడటం లేదు. సీజన్ల వారీగా చెంచుల కు అందాల్సిన పథకాలు అందడం లేదు. వి ద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కావాలన్నా కలెక్టర్‌ కా ర్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒక్క ఉద్యోగితోనే..

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వికారా బాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 15 వేల మంది చెంచుల అభివృద్ధి కోసం 2015లో పీవీటీజీ కింద ఐటీడీఏ కార్యాల యాన్ని మన్ననూరులో నిర్వహిస్తున్నారు. విభ జన సమయంలో ఒకేఒక్క రెగ్యులర్‌ ఉద్యోగిని కేటాయించారు. ప్రస్తుతం ఆయనే కార్యాలయ మేనేజరుగా పనిచేస్తున్నారు. 12 ఏళ్లలో కలె క్టర్లు, డీఎఫ్‌వో, డీటీడీవో, ఇతర జిల్లా అధికా రులే ఇన్‌ఛార్జి పీవోలుగా వ్యవహరిస్తున్నారు. కానీ పర్మినెంట్‌ పీవోను నియమించడం లేదు. దీంతో చెంచులకు అందాల్సిన పథకాలు అందడం లేదు.

Updated Date - Jul 17 , 2026 | 11:23 PM