Share News

పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:25 PM

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని రాష్ట్ర కంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్‌ చే శారు.

పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి
మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

- రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

నారాయణపేట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని రాష్ట్ర కంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్‌ చే శారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎస్‌ ఉ ద్యోగులు పురవీధుల గుండా భారీ ర్యాలీతో జన జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా పాత బస్టాండ్‌ వద్ద జరిగిన జన జాగ రణ యాత్రను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు మా ట్లాడారు. కొత్త పెన్షన్‌ విధానంతో ఉద్యోగులు విరమణ తర్వాత ఎలాంటి ప్రయోజనం లేక ఆర్థిక ఇబ్బందులు తప్పవన్నారు. 30ఏళ్లు సమా జానికి సేవ చేసిన ఉ పాధ్యాయుడికి వృ ద్ధాప్యంలో కేవలం రూ.3వేల పెన్షన్‌ వ స్తుందని ఆందోళన వ్య క్తం చేశారు. ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌, జార్ఖం డ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ర్టాల మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మే నిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలన్నారు. ఆగస్టు 23న నిర్వహించే చలో హైదరాబాద్‌ మహాసభకు భా రీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అ నంతరం స్దానిక సీవీఆర్‌ భవన్‌లో కాంగ్రెస్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డికి వినతిపత్రం అందించి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నరేష్‌, రాష్ట్ర కార్యదర్శి భాస్క ర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్‌, జిల్లా అధ్యక్షుడు కృపాకర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, రాఘవేంద్రచారి, జనార్దన్‌రెడ్డి, షేర్‌కృష్ణారెడ్డి, దామోదర్‌, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:25 PM