Share News

ముగిసిన నరసన్న బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:11 PM

తిమ్మాజిపేట మండల పరిధిలోని అప్పాజీపల్లి శివారులో నరసన్నగుట్టపై గత మూడు రో జులుగా కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్స వాలు గురువారం ముగిశాయి.

 ముగిసిన నరసన్న బ్రహ్మోత్సవాలు
ముగింపు ఉత్సవాల్లో ఎడ్లబండ్ల ప్రదర్శనలో పాల్గొని ఎద్దుల బండిని ముందుకు తోలుతున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- స్వామి వారి సన్నిధికి ఉద్దాలు

-ఎడ్లబండ్ల ప్రదర్శనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

తిమ్మాజిపేట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : తిమ్మాజిపేట మండల పరిధిలోని అప్పాజీపల్లి శివారులో నరసన్నగుట్టపై గత మూడు రో జులుగా కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్స వాలు గురువారం ముగిశాయి. చివరి రోజు ఆ యా గ్రామాలకు చెందిన భక్తులు నిర్వహించి న ఎడ్ల బండ్ల ప్రదర్శనలో నాగర్‌కర్నూల్‌ మా జీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొని ఎద్దుల బండిపై ఎక్కి భక్తులకు అభివాదం చేస్తూ బం డిని ముందుకు తోలుతూ ఆలయానికి చేరు కున్నారు. గుహలో కొలువుదీరిన లక్ష్మీనరసిం హస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ని ర్వహించారు. వేద పండితులు గంగాధర శర్మ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జోగు ప్రదీప్‌, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు వేణుగోపాల్‌గౌడ్‌, సత్యంయాదవ్‌, జల్లి తిరుపతమ్మ, చిలుక మంజుల, ఉప సర్పంచ్‌ స్వా మి, ఆయా గ్రా మాల బీఆర్‌ఎస్‌ నాయకులు ఆల య కమిటీ సభ్యు లు మాజీ ఎమ్మె ల్యేకు స్వాగతం పలికారు. అనంత రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అనుచరుడు రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌ భాస్కర్‌గౌడ్‌, వెంకటయ్య తదితరులు శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. కాగా, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో భక్తుల సౌకర్యార్థమై ఇటీవల ఆలయ ఆవరణ లో దా దాపు 20లక్షలతో రేకులషడ్లు నిర్మించిన ట్లు, త్వ రలో కల్యాణ మండపం నిర్మింజేస్తా మని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అను చరుడు చిలుక రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ది కమిటీ అధ్యక్షుడు సురేం దర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వివేక్‌రెడ్డి, రాచమంద్రారెడ్డి, రాందేవ్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కిర ణ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి అవినాష్‌రెడ్డి, చం ద్రమౌళి, వెంకట్‌రెడ్డి, అంజిరెడ్డి, రాంరెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:11 PM