Share News

హెల్త్‌కార్డుల పేరుతో పరిహాసాన్ని ఆపాలి

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:11 PM

ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లతో హెల్త్‌కార్డుల పేరుతో చేస్తున్న పరిహాసాన్ని తక్షణమే ఆపాలని స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు డిమాండ్‌ చేశారు.

హెల్త్‌కార్డుల పేరుతో పరిహాసాన్ని ఆపాలి
మాట్లాడుతున్న రాజేంద్రబాబు

పాలమూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లతో హెల్త్‌కార్డుల పేరుతో చేస్తున్న పరిహాసాన్ని తక్షణమే ఆపాలని స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోస్‌ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఓ వైపు పెన్షనర్స్‌ వేతనాల్లో కోత విధిస్తూనే ఉచిత వైద్యమని సమాజాన్ని మోసం చేస్తూ విధివిధానాలు రూపొందించలేదన్నారు. ప్రైవేటు వైద్యశాలతో ఒప్పందం చేసుకోకుండా హెల్త్‌కార్డులు జారీ చేయకుండా కాలం గడుపుతోందన్నారు. రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ ఆపేస్తామని, వైద్యసేవలు అందక పెన్షన్‌ బకాయిలు రాక 100 మంది పైగానే పెన్షనర్లు మరణించినా ప్రభుత్వానికి కనికరం లేదని ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు బాలస్వామి, రాష్ట్ర కార్యదర్శి కేసీ వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, సురేష్‌, అంజిలయ్య, వీణాదేవి, నారాయణమ్మ, శ్యామారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 11:11 PM