వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:53 PM
రాత్రి పొలం దగ్గర పడుకొన్న వ్యక్తి గొంతుకోసి హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం మోదీ పూర్ గ్రామంలో చోటుచేసుకొంది.
కోయిలకొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాత్రి పొలం దగ్గర పడుకొన్న వ్యక్తి గొంతుకోసి హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం మోదీ పూర్ గ్రామంలో చోటుచేసుకొంది. స్థానిక ఎస్‌ఐ తిరుపాజీ ఇందుకు సం బంధించిన వివరాలను వెల్లడించారు. మోదీపూర్ గ్రామానికి చెందిన గా దెపాక గోవిందు (61) బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలంలో నిద్రి స్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు. తీవ్ర రక్తస్రావంతో గోవిందు అక్కడికక్కడే మృతి చెందా డు. రూరల్ సీఐ గాంధీనాయక్, క్లూస్‌టీం సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సంఘటపై గోవిందు కుమారుడు గాదెపాక నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.