వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:19 PM
రామాయణ గ్రంథాన్ని రచించిన మహానీయుడు వాల్మీ కి జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్ట ర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి వేర్వేరు చోట్ల నివాళి అర్పించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు
గద్వాల, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రామాయణ గ్రంథాన్ని రచించిన మహానీయుడు వాల్మీ కి జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్ట ర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. వాల్మీకి జయం తి సందర్బంగా సోమవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో కలెక్టర్ పాల్గొన్నారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో బోయ వాల్మీకి సామాజికవర్గం ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చే స్తున్నదని తెలిపారు. వాల్మీకులు వారి పిల్లల కు మంచి విద్యను అందించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ రాజ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వాల్మీకి సంఘనేతలు పాల్గొన్నారు.
మార్పు సాధ్యమేనని చెప్పిన వాల్మీకి
చెడుమార్గం నుంచి సన్మార్గం వైపు పయనిం చి తన జీవితాన్నే ఆదర్శంగా మలుచుకొని ప్ర పంచానికి రామాయణ మహాకావ్యాన్ని అందించి న వాల్మీకి ఆదర్శనీయులని ఎస్పీ శ్రీనివాసరావు కొనియాడారు. సోమవారం ఎస్పీ కార్యాలయం లో వాల్మీకి మహార్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమం లో అదనపు ఎస్పీ శంకర్, ఆర్‌ఐ నరేశ్, ఆర్‌ఎస్ ఐలు, సూపరింటెండెంట్లు, వివిధ విభాగాల అధి కారులు, పోలీసులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఘన నివాళి
గద్వాల టౌన్, (ఆంధ్రజ్యోతి): భారతీయ పవి త్ర ఇతిహాసం రామాయణాన్ని అందించిన మ హర్షి వాల్మీకి మన సమాజానికి ఆదర్శనీయుడని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మా నసిక పరివర్తనతో ఎలాంటి వారైనా మహనీ యుడిగా మారతారనేందుకు వాల్మీకి జీవితం ని దర్శనమన్నారు. పట్టణంలోని వాల్మీకి భవన్‌లో మహర్షి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి కులబాంధవులకు శు భాకాంక్షలు తెలిపారు.