Share News

పండుగ సాయన్న జీవితం ధైర్య సాహసాలకు ప్రతీక

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:37 PM

పండుగ సాయన్న జీవితం ధైర్య సాహసాల కు, సామాజిక చైతన్యానికి ప్రతీక అని కలెక్ట ర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

పండుగ సాయన్న జీవితం ధైర్య సాహసాలకు ప్రతీక
పండుగ సాయన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, అధికారులు

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి) : పండుగ సాయన్న జీవితం ధైర్య సాహసాల కు, సామాజిక చైతన్యానికి ప్రతీక అని కలెక్ట ర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెనకబడిన తరగతుల అభివృ ద్ధిశాఖ ఆధ్వర్యంలో గురువారం పండుగ సా యన్న ముదిరాజ్‌ జయంతి వేడుకలను కలె క్టరేట్‌ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై పండుగ సాయన్న చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ధైర్యసాహసాలకు, ప్రజల పట్ల నిబద్దతకు, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహానీయుల జీవిత చరిత్రలను ప్రతీ ఒక్క రు తెలుసుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన వారి సేవలను స్మరించుకోవడంతోపాటు వారి జీవితాల స్ఫూ ర్తి పొందాలని తెలిపారు. పండుగ సాయన్న ముదిరాజ్‌ చరిత్రను భావితరాలకు తెలియజే యాలన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్రా, డీఆర్వో పాండు, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికా రి ఇందిర, డీటీడీవో, ఆర్డీవోలు ఉన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:37 PM