రక్షణ కల్పించి ఉంటే న్యాయవాది బతికేది
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:37 PM
పోలీసులు రక్షణ కల్పించి ఉంటే న్యాయవాది స్వప్న బతికి ఉండేదని న్యాయవాదుల స మాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.
- న్యాయవాదుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి
మహబూబ్‌నగర్ న్యూటౌన్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు రక్షణ కల్పించి ఉంటే న్యాయవాది స్వప్న బతికి ఉండేదని న్యాయవాదుల స మాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినా బాద్ మండలం కేతేరెడ్డిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది స్వప్న చేవేళ్లలో హత్యకు గురైన సంఘటనకు నిరసనగా గురువారం న్యాయవా దులు విధులు బహిష్కరించి మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వాది స్వప్న తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. పోలీసులు స్పందించి రక్షణ కల్పించి ఉంటే హత్య జరిగి ఉం డేది కాదన్నారు. గతంలో కూడా న్యాయవాదులు హత్యలకు గురయ్యారన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమ లు చేయాలన్నారు. అనంతరం న్యాయవాదులందరు ఎస్పీకి వినతి ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలి
జడ్చర్ల,(ఆంధ్రజ్యోతి) : న్యాయవాదులకు రక్షణచట్టం అమలు చేయాలని జడ్చర్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాలిక్ షాకీర్ డిమాండ్ చేశారు. న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా గురువారం జడ్చర్లలో కోర్టు విధుల ను బహిష్కరించారు. న్యాయవాదులు ప్రశాంత్, రాపోతుల శ్రీనివాస్‌గౌడ్, రమేశ్, యాదిరెడ్డి, అశోక్, విజయ్, నర్సిములు, పాండు, లక్ష్మీనారాయణ, పురుషోత్తం, ఇఫ్తెకార్ తదితరులు పాల్గొన్నారు.