భక్తిశ్రద్ధలతో దుర్గామాత విగ్రహాల ప్రతిష్ఠ
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:08 PM
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పేట జిల్లా వ్యాప్తంగా ఆదివారం భక్తిశ్రద్ధలతో దుర్గామాత విగ్రహాలను భక్తజనం ఊరేగింపులతో తరలివెళ్లి మండపాల్లో ప్రతి ష్టించారు.
- ఊరేగింపులతో మండపాలకు తరలింపు
నారాయణపేట/మరి కల్/కృష్ణ/ఊట్కూర్, అక్టో బరు 11 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పేట జిల్లా వ్యాప్తంగా ఆదివారం భక్తిశ్రద్ధలతో దుర్గామాత విగ్రహాలను భక్తజనం ఊరేగింపులతో తరలివెళ్లి మండపాల్లో ప్రతి ష్టించారు. జిల్లా వ్యాప్తంగా 226 దుర్గామాత విగ్రహాలను పట్టణ ప్రాంతాలతో పాటు పలు గ్రామాల్లో యువజన సంఘాలు, మహిళలు ప్రతిష్ఠించారు.
అదేవిధంగా, మరికల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో ఆది వారం దుర్గామాతను ప్ర తిష్ఠించారు. అర్చకుల వేదమంత్రోచ్చరణల మ ధ్య నిర్వాహకులు, గ్రామ స్థులు ప్రత్యేక పూజలు ని ర్వహించారు. మండలం లోని జలలింగేశ్వర ఆల యంలో దుర్గామాత బా లత్రిపురసుందరి దేవి అ లంకారంలో భక్తులకు ద ర్శనం ఇచ్చారు. శెట్టి సో మనాథ్, శెట్టి మల్లేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సాయం త్రం ఎంగిల పూల బతుకమ్మ సంబురాలను మ హిళలు ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు.
కృష్ణ మండల కేంద్రంలోని అంబభవానీ ఆల యంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తొమ్మిది రోజుల పాటు భక్తులు పాలు, పండ్లు ఉపవాసాలతో ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించి అనంతరం తుల్జాపురంలో అంబ భవాని దేవాలయాన్ని సందర్శించి, దసరాను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రా మస్థులు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు నాగేంద్ర, బర్మారెడ్డి, మంజునాథనాయక్, దీపక్ చౌహాన్, సందీప్‌చౌహాన్, జవర్‌లాల్, కపిల్ కం డేల్, వాల్ సురేష్, కుమార్, సంగప్పగౌడ, దిలీ ప్, మహేష్, వైభవ్‌సింగ్, చేతన్, స్థానిక సర్పం చ్ నాగేంద్ర తదితరులున్నారు.
ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి అంభాత్రయ రక్షేతంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా దురా ్గమాత దీక్షను చేపట్టిన స్వాములు ప్రత్యేక పూజ లు చేశారు. గ్రామస్థులు, ఉత్సవ కమిటీ ఆధ్వ ర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారు. స్వామి ఆదిపరాశ్రీ అమ్మ వారికి ప్ర త్యేక పూజలు చేశారు. వివిధ జిల్లాలు, గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకు న్నారు.