హౌసింగ్ జాబితాను సిద్ధం చేయాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 10:53 PM
జి ల్లాలో గృహ నిర్మాణానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితాను పూర్తిస్థాయిలో పరి శీలించి, ఎల్1, ఎల్2, ఎల్3, కేటగిరీల వారీగా వి వరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ ప్రియాంక
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష
- వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం
నారాయణపేట, సెప్టెం బరు 23 (ఆంధ్రజ్యోతి): జి ల్లాలో గృహ నిర్మాణానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితాను పూర్తిస్థాయిలో పరి శీలించి, ఎల్1, ఎల్2, ఎల్3, కేటగిరీల వారీగా వి వరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం సా యంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కొడంగల్ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ని ర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్ప టికే గుర్తించిన లబ్ధిదారుల వివరాలను మరో సారి పరిశీలించి, గృహ నిర్మాణానికి అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్ర యోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ తదితర అవసరమైన వివరాలు అందు బాటులో లేని వారి వివరాలను కూడా మూడు రోజుల్లో సేకరించి జాబితాలను పూర్తి చేయాలని సూచించారు. గృహ నిర్మాణానికి సంబంధించి అర్హత కలిగిన కేసులలో అవసరమైన ధ్రువీకర ణ, శాఖాపరమైన పరిశీలన, మంజూరు తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అ ధికారుల స్థాయిలో పూర్తి చేయాల్సిన ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేసి అవసరమైన ప్రతి పాదనలను సమర్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలె క్టర్ ప్రియాంక ఆదేశించారు. సమావేశంలో డీ డబ్ల్యూవో రాజేందర్‌గౌడ్, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, కోస్గి, మద్దూరు, మునిసిపల్ కమిష నర్లు నాగరాజు, శ్రీకాంత్, కొడంగల్ నియోజక వర్గానికి చెందిన అన్ని మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖకు చెందిన ఏఈలు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళా శాలను కలెక్టర్ ప్రియాంక బుధవారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అధ్యా పకులు, విద్యార్థుల వివరాలను అడిగి తెలుసు కున్నారు. కళాశాలలో విద్యాబోధన, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై విద్యార్థులతో నేరు గా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనం తరం ఆమె నారాయణపేట మునిసిపల్ కార్యాల యాన్ని తనిఖీ చేశారు. పట్టణంలో కొనసాగు తున్న పరిశుభ్రత చర్యలు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై అధి కారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర జలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముని సిపల్ సేవలను సమర్థవంతంగా అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.