వైభవంగా చెన్నబసవేశ్వర స్వామి రథోత్సవం
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:30 PM
The grand chariot festival of Chennabasaveshwara Swamy
మక్తల్ రూరల్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కృష్ణానది తీర ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన సుక్షేత్ర నారదగడ్డ చెన్నబసవేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం ఘనంగా ని ర్వహించారు. మండలంలోని ము స్లాయిపల్లి సమీపంలో నది ద్వీపం లో కొలువైన జాతరకు కర్ణాటక నుంచి సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం నుంచే భక్తులు రావడంతో ప్రాంగణం కోలాహలం గా కనిపించింది. ప్రత్యేక పూజలు అనంతరం సాయంత్రం భక్తుల రథోత్సవం చేపట్టారు.