Share News

మెరుగైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - May 29 , 2026 | 11:27 PM

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.

  మెరుగైన విద్యే ప్రభుత్వ లక్ష్యం
గుడిగానిపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

- అరబిందో ఫార్మా సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో రూ.1.20 కోట్లతో పాఠశాల భవన నిర్మాణం

- జూలై 4న సీఎం రేవంత్‌రెడ్డి మిడ్జిల్‌ పర్యటన

- ఎమ్మెల్యే జనంపల్లి అనిరుఽధ్‌రెడ్డి

ఊర్కొండ, మే 29 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊ ర్కొండ మండలం గుడిగానిపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమికోన్నత పాఠశాల భవనం అరబిందో ఫార్మా సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో రూ.1.20 కోట్లతో పాఠశాల నూతన భవనం, అంగన్‌వాడీ కేంద్రం ని ర్మాణానికి శుక్రవారం అరబిందో ఫార్మా ప్రతినిధులతో కలిసి శంకు స్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ముచ్చర్లపల్లి నుంచి జగబోయిన్‌పల్లి వరకు 12 కిలోమీటర్లు, మాదారం నుంచి గుడిగానిపల్లి గ్రామం మీ దుగా మల్లాపూర్‌ వరకు డబుల్‌ రోడ్డు మంజూరు అయిందన్నారు. జూలై 4న సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి మిడ్జిల్‌ మండల పర్యటన ఉంటుందన్నారు. అదేవిధంగా గుడిగానిపల్లి గ్రామవాసి, జడ్పీ మా జీ చైర్మన్‌ దివంగత ద్యాప గోపాల్‌రెడ్డి విగ్రహం మిడ్జిల్‌లో ఆవి ష్కరించనున్నారని తెలిపారు. సర్పంచ్‌ రుక్మారెడ్డి, కాంగ్రెస్‌ అధ్యక్షు డు అయూబ్‌పాష, ద్యాప నిఖిల్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:27 PM