ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:15 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను వైద్యసిబ్బంది 100 శా తం సాధించాలని డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి అన్నారు.
డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి
గద్వాల న్యూటౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను వైద్యసిబ్బంది 100 శా తం సాధించాలని డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి అన్నారు. బుధవా రం జిల్లా కేంద్రంలోని డీ ఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలో అమలవుతున్న అన్ని అరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు అన్ని పీహెచ్‌సీల సూపర్‌వైజర్లు, వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వైద్యసిబ్బంది క్షేత్రస్ధాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్ర జలకు మెరుగైన వైద్యఆరోగ్య సేవలు అందేలా బాఽధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రతి కార్యక్రమంలో ఆశించిన పురోగతి సాధించాలన్నారు. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు ప్రసూన రాణి, రాజు, డీపీహెచ్‌ఎన్‌వో వరలక్ష్మి, మీడి యా ఇంచార్జి హీర్యనాయక్, ఎస్‌ఐ తిరుమల్‌రెడ్డి, పీహెచ్‌ఎన్ తిరుమల రాణి, డీపీసీ వెంకటేష్ తదితరులు ఉన్నారు.