Share News

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:45 PM

భూ సమస్యలన్నింటికీ శాశ్వత ప రిష్కారం చూపాలన్న లక్ష్యం తో ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రక్రియను చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
వనపర్తి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, చిత్రంలో జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు

- 125 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే

- నవంబరు 15లోగా పూర్తి చేయాలి

- ఉమ్మడి పాలమూరు జిల్లా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

వనపర్తి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలన్నింటికీ శాశ్వత ప రిష్కారం చూపాలన్న లక్ష్యం తో ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రక్రియను చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమ వారం వనపర్తి కలెక్టరేట్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా లోని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారు లతో కలిసి సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూ రీసర్వే పురో గతిని అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి వుస్తున్న ఫీడ్‌ బ్యాక్‌పై ఆరాతీశారు. అనంతరం మంత్రి పొంగులేటి మా ట్లాడుతూ దాదాపు 125 ఏళ్ల క్రితం భూములు సర్వే జరి గిందని, ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సమగ్ర రీసర్వే చేపడుతున్నామ ని తెలిపారు. ఈ ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రీ సర్వే ద్వారా భూముల హద్దులు, యాజమాన్య హక్కులకు సం బంధించిన సమస్యలతో పాటు సాదాబైనామా వంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో తొలిదశలో 70 గ్రామాల్లో రీసర్వే చేపడుతున్నామని, నక్షాలో లేని 413 గ్రామాల్లోనూ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పా రు. ముందుగా గ్రామాల సరిహద్ద్దులను పక్కగా నిర్దారించి, ఆ తర్వాత భూముల సర్వే చేపట్టాలని ఆదేశించారు. నవంబరు 15లోగా రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సరికాదని హెచ్చరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రీసర్వే ఆశించిన స్థాయిలో జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. తొలి దశలో జరిగిన తప్పులు రెండో దశలో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే అర్జీలను జిల్లా అధికారులు పరిశీలించి పరిష్కార మా ర్గాలు చూపాలని సూచించారు. ప్రతీ నెలలో ఒక్కో మండ లానికి ఒక రోజును కేటాయించి, ఆ మండలానికి సంబంధించి న ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తన నియో జకవర్గంలో మక్తల్‌, ఆత్మకూర్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చే యాలని కోరారు. పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూ సమస్య ను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ నుంచి క్లర్క్‌ వరకు అధికా రులు అందరూ ప్రజలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండాలని సూచించారు.

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ పట్టణ శివారులోని సర్వే నంబరు 9లో రెవెన్యూ, దేవదాయ శాఖల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్‌రెడ్డి ప్రస్తావించిన సమస్యలపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ కొత్తకోట మండలం రాఘవేంద్ర కాలనీలోని టెనెంట్‌ ల్యాండ్‌ సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని, ఈదులబావి తండాలో దేవదాయ శాఖ పరిధిలో ఉన్నట్లు చూపిస్తున్న భూములకు సంబంధిం చిన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు వనపర్తి కలెక్టరేట్‌ నుంచి జిల్లాలో నిర్మించను న్న ఐదు ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, జి.మధుసూధన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ట, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, రిజిస్ర్టేషన్లు, స్టాంప్స్‌ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌, కలెక్టర్లు ఆదర్శ్‌ సురభి, హేమంత కేశవ్‌ పాటిల్‌, సీహెచ్‌ ప్రియాంక, కుష్బూ గుప్తా, కార్పోరేషన్‌ చైర్మన్‌ సరిత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:51 PM