మహిళల్లో అక్షర వికాసం పెంచడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:11 PM
మహిళల్లో అక్షర జ్ఞానం పెంచి వారిలో అక్షర వికాసం నింప డమే లక్ష్యమని ఉల్లాస్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌బాబు అన్నారు.
ఉల్లాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌బాబు
కోస్గి రూరల్/దామరగిద్ద, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహిళల్లో అక్షర జ్ఞానం పెంచి వారిలో అక్షర వికాసం నింప డమే లక్ష్యమని ఉల్లాస్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌బాబు అన్నారు. ఆదివారం కోస్గి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీ ఉర్దూ మీడియం, జడ్పీ బాలుర పాఠశాలల్లో నిరక్ష్యరాస్యులైన మహిళలకు ఉల్లా స్ ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ టెస్ట్(ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ) నిర్వహించారు. జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు 307 మంది మహిళలు హాజరయ్యారు. పరీక్షలను మునిసి పల్ చైర్మన్ నరేందర్ పరిశీలించారు. ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ రఘునాథ్, సీవో మైముద్, ఆర్పీలు పాల్గొన్నారు.
అదేవిధంగా, దామరగిద్దలో మండల మహి ళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1890 మంది మహిళలకు అక్షరమాల ద్వారా చదవ డం, రాయడం నేర్పించారు. కార్యక్రమంలో ఏపీ ఎం అంజలయ్య, సీసీలు కిష్టప్ప, అంజిలప్ప, హనుమంతు, మండల మహిళా సమాఖ్య ఓబీ లు అరుంధతి, సరిత, రేణుక, వీవోఏ పాల్గొ న్నారు.