అభ్యర్థి ఎవరైనా గెలుపే ధ్యేయం
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:57 PM
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పిలుపునిచ్చారు.
- ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయించాలి
- ప్రభుత్వ వ్యతిరేక ఓటును అనుకూలంగా మార్చుకోవాలి
- ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ నాయకులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్లు, విద్యావం తులలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి ఓటును మనకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఉమ్మ డి పాలమూరుకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం నిర్వహించా రు. మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, ఎస్ నిరంజన్‌రెడ్డి, సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మో హన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ అత్యంత కీలకమన్నారు. అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓట రుగా నమోదు చేయించాలని సూచించారు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థి విజయం కోసం బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పని చేయాలని కోరారు. సమావేశంలో మాజీ శాట్స్ చైర్మన్ ఆంజ నేయులుగౌడ్, గద్వాల జిల్లా నాయకుడు హనుమంత్‌నా యుడు పాల్గొన్నారు.