Share News

పోలియో రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:01 AM

పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని మ హబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ గుమ్మల మమత శ్రీనివాస్‌ అన్నారు.

పోలియో రహిత సమాజమే లక్ష్యం
మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌లో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న మేయర్‌ మమత

నగర మేయర్‌ గుమాల్‌ మమత శ్రీనివాస్‌

మహబూబ్‌నగర్‌, వైద్య విభాగం 28 (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని మ హబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ గుమ్మల మమత శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎ.శ్రీనివాసులతో కలిసి బస్టాండ్‌లో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ పిల్లల ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరు ఐదేళ్ల పిల్లలకు పోలియో చు క్కలు వేయించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడంలో భాగస్వాములు కావాలని కోరారు. రెండు చక్కలు పిల్లల జీవితానికి శ్రీరామరక్ష అని అన్నారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌, వైద్య ఆరోగ్య వాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:01 AM