గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:00 AM
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
నల్ల చెరువు ట్యాంక్‌బండ్ దగ్గర
వనపర్తి టౌన్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని నల్లచెరువు ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళ, బుధ, గురువారాల్లో నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముం దస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రాం తంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, పార్కింగ్, తాగునీరు, పారి శుధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించా రు. ప్రజలు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులకు సహక రించాలని కోరారు. కలెక్టర్ వెంట మునిసిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధు సూదన్‌గౌడ్, కమిషనర్ నిరంజన్, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, పోలీస్ అధికారులు ఉన్నారు.