భారత్‌లో బాక్సింగ్ క్రీడకు ఉజ్వల భవిష్యత్
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:32 PM
భారత్ బా క్సింగ్ క్రీడలకు ఉజ్వల భవిష్యత్ ఉందని ఇండియన్ అమెచ్యూర్ బా క్సింగ్ ఫెడరేషన్ (ఐఏబీఎఫ్) జాతీయ అధ్యక్షుడు రాకేష్ మిశ్రా అన్నా రు.
- విజేతలు ఐబీఏ ప్రెసిడెంట్స్ కప్ పోటీలకు ఎంపిక
- ఐఏబీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రాకేష్ మిశ్రా
- ముగిసిన జాతీయస్థాయి బాక్సింగ్ టోర్నీ
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): భారత్ బా క్సింగ్ క్రీడలకు ఉజ్వల భవిష్యత్ ఉందని ఇండియన్ అమెచ్యూర్ బా క్సింగ్ ఫెడరేషన్ (ఐఏబీఎఫ్) జాతీయ అధ్యక్షుడు రాకేష్ మిశ్రా అన్నా రు. జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సీనియర్ పురుషుల ఓపె న్ బాక్సింగ్ చాంపియన్‌షిప్(జయప్రకాశ్ నారాయణ్ ట్రోఫి) ఆది వారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజే తలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. జయప్రకాష్ నారాయణ్ జయంతి పురస్కరించుకొని జేపీ ఎన్‌సీఈ చైర్మన్, తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికు మార్ జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించడం అభినం దనీయం అన్నారు. రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దేశంలో బాక్సింగ్ క్రీడను పర్యవేక్షించేందుకు 1949లో స్థా పించబడిన ఒక చారిత్మక క్రీడా సమాఖ్య ఇండియన్ అమెచ్యూర్ బా క్సింగ్ ఫెడరేషన్ అని గుర్తుచేశారు. విజేతలు టర్కీలోని ఇస్తాంబుల్ న గరంలో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) ప్రెసిడెంట్స్ కప్‌లో పా ల్గొంటారని తెలిపారు. కళాశాల చైర్మన్ , తెలంగాణ బాక్సింగ్ డెవల ప్‌మెంట్ అధ్యక్షుడు కె.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ.. బాక్సింగ్ క్రీడా భివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకు ముందు కళా శాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిం చాయి. కార్యక్రమంలో ఐఏబీఎఫ్ సెక్రటరి రాకేష్ తాక్రాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువీర్‌సింగ్, ఏపీ అధ్యక్షుడు నిశాంత్‌రాజ్, వైస్ చైర్మన్ భాస్కర్, కళాశాల కార్యదర్శి వెంకటరామారావు, ప్రిన్సిపాల్స్ కృష్ణమూర్తి, చంద్రశేఖర్, టీజీ బాక్సింగ్ కో ఆర్డినేటర్ వెంకట్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
బాక్సింగ్ విజేతలు వీరే..
బాక్సింగ్ పోటీల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో వివిధ కేటగిరీల్లో ఆయా రాష్ట్రాల క్రీడాకారులు గెలుపొందారు. 48 కిలోల విభాగంలో దేవేందర్‌సింగ్ సోలాంకి (రాజస్థాన్), జయంత్ స్వరూప్ (ఆంధ్ర ప్రదేశ్), 54 కిలోలు విభాగంలో హనీ ఒహ్లియాన్ (హరియాణా), షొమోర్జీత్ (కర్ణాటక), 60 కిలోల విభాగంలో యోగేష్ (హర్యానా), మోహిత్ (ఉత్తరప్రదేశ్), 67 కిలోల విభాగంలో అకింత్‌కుమార్ (హరియాణా), సుఖ్‌దేవ్(ఢిల్లీ), 75 కిలోల విభాగంలో జయదీప్ రావత్ (ఉత్తరఖాండ్), సోహెల్(అస్సాం), 86 కిలోల విభాగంలో పర్వ్ (హరియాణా), ఆకాష్ (పంజాబ్), 88 కిలోల విభాగంలో ఆకాష్.కే ( అస్సాం), జయవర్ధన్‌రెడ్డి(లక్షద్వీప్).