నాలుగవ యూనిట్ సిద్ధం చేయాలి
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:35 PM
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నాలుగవ యూనిట్ మరమ్మతు పనులను జూలై మొదటి వారంలోగా పూర్తి చేయాలని జెన్‌కో హైడెల్ డైరెక్టర్ పిల్లి బాలరాజు, సివిల్ డైరెక్టర్ అజయ్‌కుమార్ అన్నారు.
- జూలై మొదటి వారంలోగా పూర్తి కావాలి
- జెన్‌కో హైడెల్ డైరెక్టర్ పిల్లి బాలరాజు
- శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం పరిశీలన
బ్రహ్మగిరి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నాలుగవ యూనిట్ మరమ్మతు పనులను జూలై మొదటి వారంలోగా పూర్తి చేయాలని జెన్‌కో హైడెల్ డైరెక్టర్ పిల్లి బాలరాజు, సివిల్ డైరెక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. ఆరేళ్ల క్రితం షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన నాలుగవ యూనిట్ మ రమతు పనులను, పెన్‌స్టాక్ గేట్లను పరిశీలించారు. అనంతరం విద్యుత్ కేంద్రం కాన్ఫరె న్స్ హల్లో ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. నాలుగవ యూనిట్లో సాంకేతిక లోపాలపై చర్చించారు. వాయిత్ కంపెనీ 2023 నుంచి 2025 వరకు మూడు సార్లు నాలుగవ యూనిట్‌కు మరమ్మతు చేపట్టినా ప్రయో జనం లేకపోయిందన్నారు. ఇప్పటికే రూ. 25 కోట్ల వరకు ఖర్చయిందని, దీంతో జెన్‌కోకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ సారి మరమ్మతు పూర్తి చేసే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట ఈగలపెంట జెన్‌కో సీఈ కే వీవీ సత్యనారాయణ, ఎస్‌ఈలు రవీంద్రకుమార్, ఆది నారాయణ, డీఈలు శ్రీకుమార్‌గౌడ్, శ్రీధర్ తదితరులు ఉన్నారు.