Share News

ప్రాక్టికల్‌ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతం

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:13 PM

ఇంటర్‌ జనరల్‌, వృత్తి విద్య ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి.

ప్రాక్టికల్‌ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతం
గద్వాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రయోగ పరీక్షను పరిశీలిస్తున్న డీఐఈవో హృదయరాజు

గద్వాల సర్కిల్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ జనరల్‌, వృత్తి విద్య ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. జిల్లా వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాల్లో ఉ దయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో మొద టి విడత ఫిజిక్స్‌, కెమిస్ర్టి, బాటనీ, జువాలజీ ప్రయోగ పరీక్షలు సజావుగా సాగాయని డీఐ ఈవో, పరీక్షల జిల్లా కన్వీనర్‌ హృదయరాజు తెలిపారు. ఉదయం ప్రయోగ పరీక్షలకు జనరల్‌ విభాగంలో 511 మంది విద్యార్థులకు 500 మంది విద్యార్థులు హాజరుకాగా 11మంది గైర్హాజరయ్యారని తెలిపారు. వృత్తి విద్యావిభాగంలో 637 మంది విద్యార్థులకు 597 మంది, మధ్యా హ్నం జనరల్‌ విభాగంలో 434 మంది విద్యార్థులకు 426 మంది, వృత్తివిద్యా విభాగంలో 603 మంది విద్యార్థులకు 580మంది విద్యార్థులు హా జరయ్యారని తెలిపారు. గద్వాలలోని ప్రభుత్వ జూనియర్‌, ప్రభుత్వ బాలికల, కొట్టం మాణిక్య మ్మ జూనియర్‌ కళాశాల, అంబేడ్కర్‌, శ్రీవిద్య వృత్తి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలలో జరిగి న ప్రయోగ పరీక్షలను కన్వీనర్‌ హృదయరాజు పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందిరాకుండా చూడాలని పరీక్షల చీ్‌ఫ్‌ సూపరింటెండెంట్లకు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లకు సూచించారు.

Updated Date - Feb 02 , 2026 | 11:13 PM