రీయింబర్స్‌మెంట్ విడుదల చేసే వరకు పోరాటం
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:15 PM
ఫీ జు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేసే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ప్రసాద్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా
గద్వాల టౌన్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఫీ జు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేసే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ప్రసాద్ అన్నారు. ఇచ్చిన హామీని ని లుపుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫ లమైందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న వి ద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడు దల కోసం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి - బీజేపీ లడాయి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్‌లో ధర్నా నిర్వ హించారు. ఇదే డిమాండ్‌తో పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు రాంచందర్‌రావు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా నాయకులు స్థానిక ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పాతబస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన భరత్‌ప్రసాద్, నిధులు విడుదల కాని కారణంగా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందకఆందోళనకు గురవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందనలేకపోవడం బాధ్యతా రాహిత్యమన్నారు. శిబిరంలో మాట్లాడిన జిల్లా నాయకురాలు డీకే స్నిగ్దారెడ్డి, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని, యేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా మా ట నిలుపులేకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యా ర్థులు సాగిస్తున్న పోరాటానికి బీజేపీ పూర్తి అం డగా ఉంటుందని, నిధులు విడుదల చేసే వర కు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ర వికుమార్ ఎక్బోటే, శ్యాంరావు, పట్టణ అధ్యక్షు రాలు జయశ్రీ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షు రాలు సమతగౌడ్, కౌన్సిలర్లు శాలన్న, చంద్రశేఖ ర్, నాయకులు కిష్టన్న, దేవదాస్, తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు, తిమ్మారెడ్డి, అక్బర్ పాషా, పాండు, గాంజ సాయి, సతీష్, పవన్, అశోక్, తిరుమల్, శివ ఉన్నారు.