Share News

విద్యార్థుల్లో గణితంపై భయం పోగొట్టాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:23 PM

డిజిటల్‌ వనరుల వినియోగ బోధనతో కొందరి విద్యార్థుల్లో సహజంగా ఉండే గణిత భయం పోగొట్టాలని బిల్డింగ్‌ కెపాసిటీ శిక్షణ కేంద్ర కోర్స్‌ ఇన్‌చార్జి, జోగుళాంబ గద్వాల జిల్లా జిల్లా ప్రభుత్వ పరీక్ష అసిస్టెంట్‌ కమిషనర్‌ టీ.శ్రీనివాస్‌ సూచించారు.

విద్యార్థుల్లో గణితంపై భయం పోగొట్టాలి
బిల్డింగ్‌ కెపాసిటీ శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న కోర్స్‌ ఇన్‌చార్జి టీ.శ్రీనివాస్‌

  • బిల్డింగ్‌ కెపాసిటీ శిక్షణ కోర్స్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌

గద్వాల సర్కిల్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ వనరుల వినియోగ బోధనతో కొందరి విద్యార్థుల్లో సహజంగా ఉండే గణిత భయం పోగొట్టాలని బిల్డింగ్‌ కెపాసిటీ శిక్షణ కేంద్ర కోర్స్‌ ఇన్‌చార్జి, జోగుళాంబ గద్వాల జిల్లా జిల్లా ప్రభుత్వ పరీక్ష అసిస్టెంట్‌ కమిషనర్‌ టీ.శ్రీనివాస్‌ సూచించారు. గద్వాల మండలం గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లో ఆదివారం రెండో విడతలో భాగంగా ‘ఏ బు క్‌ ఆన్‌ డిజిటల్‌ లర్నింగ్‌’ అనే అంశంపై ప్రారంభమైన అలంపూర్‌ నియోజకవర్గ గణిత ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో కోర్స్‌ ఇన్‌చార్జి ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. డిజిటల్‌ వనరుల బోధన వల్ల విద్యార్థులు ఆసక్తి కనబర్చడంతో పాటు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలుతారని పేర్కొన్నారు. మూసధోరణి బోధనకు స్వస్తిపలికి విప్లవాత్మకపరమైన సాంకేతిక డిజిటల్‌ విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుందని వివరించారు. విద్యార్థుల అభ్యసనాస్థాయిని ఎప్పటికపుడు అంచనా వేసి డిజిటల్‌ బోధనతో ముందుకు సాగాలని ఉపాధ్యాయులకు సూచించారు. డిజిటల్‌ పాఠ్యాంశాల రూపకల్పన, గణిత సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. డిజటల్‌ విద్యతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ పోటీ పరీక్షలకు, ఉపాధి అవ కాశాలకు దోహదపడుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిస్ర్టిక్ట్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ వెంకటేశ్‌, లక్ష్మన్‌, యాదయ్య, రత్నమాల పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:23 PM