Share News

వృద్ధుల అనుభవాలు యువతకు మార్గదర్శకం

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:17 PM

విభిన్న రకాల సామాజిక స్థితిగతులను, కాలమాన పరిస్థితులను అధిగమిస్తూ వచ్చిన వయోవృద్ధుల అనుభవం యువతకు మార్గదర్శకమని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ అన్నారు.

వృద్ధుల అనుభవాలు యువతకు మార్గదర్శకం
వృద్ధుల హక్కుల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, అధికారులు

  • కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

  • ఘనంగా వయో వృద్ధుల దినోత్సవం

గద్వాలటౌన్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): విభిన్న రకాల సామాజిక స్థితిగతులను, కాలమాన పరిస్థితులను అధిగమిస్తూ వచ్చిన వయోవృద్ధుల అనుభవం యువతకు మార్గదర్శకమని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ అన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి, వారని సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తున్నట్లు తె లిపారు. సోమవారం స్థానిక బాలభవన్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్‌, కుటుంబ జీవనంలో కొంతమంది వయోవృద్ధులు ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు, వారి సంక్షేమానికి ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ యాక్ట్‌-2007 ద్వారా వృద్ధులకు సంక్రమించిన హక్కులపై అవగాహన పెంచుకోవాల న్నారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా ఉండి, వారి బాగోగులను పట్టించుకోని పిల్లలపై చట్టం ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, అదే సమయంలో అంతకుపూర్వం వారికి రాసి ఇచ్చిన ఆస్తులను సైతం తిరిగి తీసుకునే అవకాశం ఉందన్నారు. 65ఏళ్లు నిండిన స్ర్తీలకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇస్తుందన్నారు. వృద్ధులు ఆరోగ్యంపైశ్రద్ధ వహించాలని, ఇష్టమైన వ్యాపకాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిం చారు. స్థానిక స్మృతివనంలో యోగా షెడ్‌ నిర్మాణం చేపట్టామని, రెడ్‌క్రాస్‌ భవనంలో రీక్రియేషన్‌ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు సమస్య తలెత్తినా వృద్ధులు నేరుగా కలుసుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వయోవృద్ధులను కలెక్టర్‌ సన్మానించారు. అనంతరం సీనియర్‌ సిటిజన్స్‌ హక్కులు, చట్టాలకు సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు. వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని ని ర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సెర్ఫ్‌ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్లు గిరిజ కళ్యాణి, మైథిలి, డీడ్ల్యూవో సునంద, డీఎంహెచ్‌వో సంధ్య కిరణ్మయి, ఏపీడీ శ్రీనివాస్‌, డీసీపీవో నరసింహ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ సంగాల అయ్యపురెడ్డి, సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఉన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:17 PM