Share News

ఉద్యోగ పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:39 PM

ఎ న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యో గ, ఉపాధ్యాయుల పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేసి, పీఆర్‌సీ ప్రకటించాలని స్టేట్‌ టీ చర్స్‌ యూనియన్‌(ఎస్టీయూ) జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పులిపాటి లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి

  • ఎస్టీయూ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌

గద్వాల టౌన్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఎ న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యో గ, ఉపాధ్యాయుల పెండింగ్‌ డీఏలను వెంటనే విడుదల చేసి, పీఆర్‌సీ ప్రకటించాలని స్టేట్‌ టీ చర్స్‌ యూనియన్‌(ఎస్టీయూ) జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పులిపాటి లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. అధికారం లోకి వచ్చి రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చూపుతు న్న నిర్లక్ష్యం విచారకరమన్నారు. ఆదివారం పట్ట ణంలోని యూనియన్‌ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భం గా మాట్లాడిన లక్ష్మణ్‌, గడిచిన మూడు నెలలు గా ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నప్పటికీ హెల్త్‌కార్డులు ఇవ్వకపోవడం దారుణమైన విష యమన్నారు. దీంతో పాటే ఉపాధ్యాయ పదోన్న తులు, ఖాళీల భర్తీ, సీపీఎస్‌ విధానం రద్దు, 2008 డీఎస్‌సీ ఉపాధ్యాయులు సర్వీసు రెగ్యుల రైజేషన్‌ వంటి సమస్యలపై తమ యూనియన్‌ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధంగా ఉందన్నా రు. త్వరలోనే 80వ వార్షికోత్సవం నిర్వహిం చుకునేందుకు సిద్ధపడుతున్న యూనియన్‌ స భ్యత్వాలను జిల్లాలో వేగవంతం చేయాలని నా యకులు కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ యూనిస్‌ పాషా, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు శంకర్‌ నాయక్‌, జిల్లా ఆర్థిక కార్యదర్శి విజయ్‌భాస్కర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు కృష్ణ య్య,వెంకటేశ్‌, భీమన్న,సురేందర్‌రావు ఉన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:39 PM