Share News

ప్రతిధ్వనించిన ప్రణవనాదం

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:25 PM

మహాశి వరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉమామహేశ్వర క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడిం ది.

 ప్రతిధ్వనించిన ప్రణవనాదం
ఉమామహేశ్వరంలో క్యూలైన్‌లో భక్తులు

- ఉమామహేశ్వరంలో పోటెత్తిన భక్తులు

- కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో రాక

అచ్చంపేట, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మహాశి వరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉమామహేశ్వర క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడిం ది. మునుపెన్నడూ లేనివిధంగా భక్తుల తాకిడి పె రగడంతో ఉమామహేశ్వర క్షేత్రం భక్తజన సంద్రం గా మారింది. బోగమహేశ్వరం వరకు వాహనాలను అనుమతించడంతో పరిసర ప్రాంతాలు మొత్తం వా హనాలతో నిండిపోయింది. ఆలయ కమిటీ ఆధ్వ ర్యంలో కొండపైకి బస్సులు నడిపిన సరిపోకపోవ డంతో చాలామంది భక్తులు మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.

ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాక నల్గొం డ, హైదరాబాద్‌, కర్ణాటక నుంచి పెద్దఎత్తున భక్తు లు తరలి వచ్చారు. మహాశివరాత్రి ఈశ్వరుడికి ప్రీ తి పాత్రమైన రోజు కావడంతో ఆలయంలో భక్తులు పోటెత్తారు. పాప నాశిని గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి ఈశ్వరునికి క్షీరాభిషేకం, అమ్మవారికి కుం కుమార్చన గణపతి అయ్యప్పస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆల య ఈఓ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్‌ బీ రం మాధవరెడ్డిలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

- కొత్తకోట, (ఆంధ్రజ్యోతి) :వనపర్తి జిల్లా కొత ్తకోట మండలం పామాపురం రామేశ్వరస్వామి ఆల య సమీ పంలోని ఉకశెట్టి వాగులో ఉన్న 38 అడు గుల శివుని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.

మల్లెలతీర్థంలో..

బ్రహ్మగిరి, (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వది నం సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే నల్లమల ప్రాంతంలో ఉన్న దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న మల్లెలతీర్థంలో కొలువైన లింగమయ్యస్వామికి స్థాని క చెంచు గిరిజనులు ప్రత్యేక పూజలు చేసిన అనం తరం వందలాది మంది దర్శనం చేసుకున్నారు. ఎ డమ పాతాళగంగ పుష్కర ఘాట్‌లో తెలంగాణ వై పు నుంచి వివిధ ప్రాంతాల భక్తులు శ్రీశైలం మల్ల న్న దర్శనం చేసుకునేందుకు ముందుగా పాతాళగం గలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీశైలానికి వెళ్లారు. బ్రహ్మగిరి, వటవర్లపల్లి, కృష్ణగిరి, పాతాళగంగ, సా ర్లపల్లి గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

కృష్ణానదిలో పుణ్యస్నానాలు

కొల్లాపూర్‌, (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వది నం సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామం చుట్టూ ఉన్న నల్ల మల అడవులు దద్దరిల్లేలా శంభోశివ శంభో నామ స్మరణం మారుమో గింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమశిల గ్రామంలో శివాలయంగా ప్రసిద్దిగాంచిన లలితాంబిక సోమేశ్వర ఆల యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున శివ భక్తు లు మహిళలు, చిన్నారులు ద్వారదశ జ్యోతిర్లింగాల ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మ హిళలు కుంకు మార్చన రుద్రాభిషేకం, ద్వాదశ జ్యో తిర్లింగాల దర్శనంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. సోమశిల కృష్ణానది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సో మశిల గ్రామ సర్పంచ్‌ కాటం వెంకటలక్ష్మి ఆధ్వర్యం లో భక్తులకు అన్ని వసతులు పార్కింగ్‌, తాగునీటి సమస్యతోపాటు నీడ వసతి కల్పించారు. లలితాం బిక సోమేశ్వర ఆ లయంలో కొల్లాపూర్‌ సీఐ కె.మ హేష్‌ దంప తులు పూజలు నిర్వహించారు. ఎస్‌ఐ బి.సు రేష్‌తోపాటు కొల్లాపూర్‌ పట్టణ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఇటీవల గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ వంగ అనూష రాజశేఖర్‌గౌడ్‌ దంపతులకు ఘనంగా సన్మానించారు. తెలం గాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 120 మంది కళాకారులచే ఆట పాటలు నిర్వహించారు.

Updated Date - Feb 15 , 2026 | 11:25 PM