సొంతింటి కల ప్రజాపాలనతో సాకారం
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:24 PM
పేదల సొంతింటి కల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనతో సాకారమవు తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల టౌన్/గట్టు/మల్దకల్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనతో సాకారమవు తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాలలోని 27వ వార్డు పరిధి ఎర్రమట్టి వీధిని బుధవారం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే లబ్ధిదారుడు దౌలు కుటుం బానికి కానుకలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి బిల్లుల విషయంలో అపోహలు నమ్మవద్దని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోవిందు, బాబర్, నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, విక్రమసింహారెడ్డి, విజయ్, ప్రభాకర్‌రెడ్డి, తుమ్మల నరసింహులు, మురళి, శ్రీనుముదిరాజ్, టి.గోవిందు, ధర్మనాయుడు, నారాయణరెడ్డి, వీరేశ్, చంద్రశేఖర్, వెంకటేశ్, రాజు ఉన్నారు.
గట్టు: మండలంలోని చాగదోణ, ఆరగిద్ద, చిన్నోనిపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. చాగదోణలో ఎస్సీకాలనీలో వాటర్‌ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు. నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ వీరేశ్స్వామి, శేఖర్ ఉన్నారు.
మల్దకల్ : ఏళ్లుగా అద్దెఇంట్లో, గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇంటి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల నెరవేరిందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. దాసరపల్లి, మల్దకల్లో లబ్ధిదారులు వెంకటన్న, అశోక్, చిన్న అంజి, నర్సింహులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు.