నిందితులకు కఠిన శిక్ష విధించాలి
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:28 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన కుల అహంకార చర్యలకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని పీ వైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్, సి ద్ధు డిమాండ్ చేశారు.
- పీవైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్, సిద్దూ
నారాయణపేట న్యూ టౌన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన కుల అహంకార చర్యలకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని పీ వైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్, సి ద్ధు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. టికెట్ లేకుండా గుడిలోకి ప్ర వేశించిన కారణంగా చాకలి కులస్థులైన గణేష్, చంద్రకళ, మౌనికలపై అదే సర్పంచ్ తుకారాం రెడ్డి, సతీష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మధురెడ్డి వర్గం అంతా దుర్భాషలాడి, వారిపై కిరాతంగా దాడి చేసి, మూడు నెలల పసిబిడ్డను చంపడం ఘో రమన్నారు. రెడ్డీల దురహంకార ఘటనలు త మ శాఖ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఘటన జరిగిన నాలుగు రోజులైనా నిందితులను అరె స్టు చేయకపోవడం, బాధిత కుటుంబీకులపైనే కేసులు పెట్టి, అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తున్న పో లీసు వ్యవస్థ దుర్మార్గమైనదన్నారు. బాధ్యతా రహితంగా వ్యవహరించిన స్థానిక పోలీసులను వెంటనే విధుల నుంచి తొలగించాలని డి మాండ్ చేశారు.
పసిబిడ్డ ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలి
ధన్వాడ,: బహుజనుల ప్రాణాలకు రక్షణ లేదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెల శ్రీని వాస్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మూ డు నెలల బీసీ చాకలి బిడ్డ ప్రాణాలు బలిగొన్న ఆధిపత్యవర్గాల వారిని కఠినంగా శిక్షించాలని, పాలన చేతకాకుంటే ముఖ్యమంత్రి రాజీనమా చేయాలని డిమాండ్ చేశారు.
రాస్తారోకో
స్థానికంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఆది వారం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహిం చారు. కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో దంపతులపై అకారణంగా దాడిచేసి, చిన్నారి మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, బాలయ్య, భాస్కర్, బాల్‌రాజ్, కృష్ణయ్య, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.