Share News

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:21 PM

గోవును జాతీ య జంతువుగా ప్రకటించి, గో వధను నిషేధించాలని ఆ దివారం జిల్లా కేంద్రంలోని సత్యానారాయణ చౌరస్తాలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వ ర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
నారాయణపేటలో సంతకాలు సేకరిస్తున్న నాయకులు

నారాయణపేట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): గోవును జాతీ య జంతువుగా ప్రకటించి, గో వధను నిషేధించాలని ఆ దివారం జిల్లా కేంద్రంలోని సత్యానారాయణ చౌరస్తాలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వ ర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. గో రక్ష జిల్లా ప్ర ముఖ్‌ మిస్కిన్‌ సందీప్‌ మా ట్లాడుతూ గో రక్షణ కోసం చ ట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా 1200 మంది గో సంరక్షణ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్‌, అనిల్‌, మురళీ భట్టడ్‌, శ్రావణ్‌, ఆకాష్‌, చక్రి, చరణ్‌, అరవింద్‌, రాజశేఖర్‌, రాఘవ నరసప్ప పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 11:21 PM