దేశ అభివృద్ధే మోదీ లక్ష్యం : ఎంపీ డీకే అరుణ
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:26 PM
భారత దేశ అభివృద్ధి, సాంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతోందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.
భూత్పూర్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : భారత దేశ అభివృద్ధి, సాంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతోందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం మునిసిపాలిటీలోని బీజేపీ కార్యకర్త మల్లేశ్ ఇంట్లో ఏర్పాటు చేయగా, ఎంపీ డీకే అరుణతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, దేవరకద్ర నియోజవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. 10వ వార్డులోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి గోప్లాపూర్‌లో మల్లేశ్ ఇంట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులు, రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కిషాన్‌మోర్చా నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, బాలకృష్ణ, సత్తయ్యగౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, గాల్‌రెడ్డి, మల్లేశ్, రాజగోపాల్‌రెడ్డి, నరేష్‌చారి, చంద్రశేఖర్, రమేష్‌చారి పాల్గొన్నారు.