Share News

లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:23 PM

మునిసిపల్‌ ఎన్నిక ల ప్రక్రియను పారదర్శకం గా నిర్వహించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికా రులను ఆదేశించారు.

లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి
మాక్‌ కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరే ట్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్ర జ్యోతి): మునిసిపల్‌ ఎన్నిక ల ప్రక్రియను పారదర్శకం గా నిర్వహించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అధికా రులను ఆదేశించారు. పాల మూరు యూనివర్సిటీలో ని ర్వహించనున్న మహబూ బ్‌నగర్‌ కార్పొరేషన్‌, భూ త్పూర్‌, దేవరకద్ర మునిసిపాలిటీల ఎన్నికల లెక్కింపునకు సంబంధించి గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మాక్‌కౌంటింగ్‌ నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, కౌంటింగ్‌ సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఓట్ల లెక్కింపును ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది ఓట్ల లెక్కింపు కోసం ఉదయం 6 గంటలకల్లా తమకు కేటాయించిన కౌంటింగ్‌ కేంద్రాలకు హాజరుకావాలని కలెక్టర్‌ సూచించారు. స్థానిక సంస్థల కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామ్‌రెడ్డి, ఆర్‌డీవో నవీన్‌, డీపీవో వెంకట్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్లు. మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:23 PM