Share News

ఆసుపత్రి నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:33 PM

కల్వకుర్తి లో నిర్మిస్తున్న వంద ప డకల ఆసుపత్రి నిర్మాణా న్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అధికారు లను ఆదేశించారు.

  ఆసుపత్రి నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలి
ఎస్సీషాపింగ్‌ కాంప్లెక్స్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

కల్వకుర్తి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి లో నిర్మిస్తున్న వంద ప డకల ఆసుపత్రి నిర్మాణా న్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అధికారు లను ఆదేశించారు. నాగ ర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలో 100పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం దించేందుకు ఈ ఆసుపత్రి కీలకమన్నారు. అనంతరం పట్టణంలో నిర్మించిన ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ సముదాయాన్ని పరిశీలించారు. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం డ్రా విధానంలో షాపుల కేటాయింపు జరుగు తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ షానవాజ్‌ఖాన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ మహమ్మ ద్‌షేక్‌, తహసీల్దార్‌ ఇబ్రహీం, ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ శివరాం, కౌన్సిలర్లు, అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 11:34 PM