Share News

కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:41 PM

రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభు త్వానికి పుట్ట గతులుండవని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు

భూత్పూర్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభు త్వానికి పుట్ట గతులుండవని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సో మవారం మండలంలోని అన్నాసాగర్‌లో తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. జూరాలలో పుష్క లంగా నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగు నీరు ఇవ్వకుండా ఎల్‌నినో పేరుతో కాంగ్రెస్‌ మోసం చేస్తోందని దుయ్యబట్డారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యం లో జూరాల వద్ద నిరసన కార్యక్రమం తెలుపడా నికి వెళ్తుంటే గృహ నిర్భంధం చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. జూరాలో 8.8 టీ ఎంసీల నీరు ఉందని జూరాల కింద పంటలు నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. ఎల్‌నినో ప్ర భావం ఉన్నా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వ ర్షాలకు బాగా కురియడంతో జూరాలకు నీరు వ చ్చిందని, ఆ నీటిని మోటార్ల ద్వారా ఎప్పటికప్పు డూ ఎత్తుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దే వా చేశారు. పాలమూరు జిల్లాకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా మిషన్‌ భగీరథ నీరు తీసుకుంటు న్నామని, గద్వాల, అలంపూర్‌కు 2 టీఎంసీల నీ రు ఎడాది మొత్తం సరిపోతుందని, ఇంకా 5 టీ ఎంసీల నీరు ఉందని, దాన్ని రైతులకు అందిం చాలన్నారు. కృష్ణా నీటి ఆంధ్రప్రదేశ్‌ తీసుకెళ్తుం టే ఈ ప్రభుత్వం గుడ్లు అప్పగించుకొని చూస్తోందని విమర్శించారు. కాలువల ద్వారా నీ రు రావాలంటే కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని ఎమ్మెల్యే జీఎంఆర్‌ ఆర్డర్‌ జారీ చేయడం చూ స్తుంటే పిచ్చితుగ్లక్‌ పాలన గుర్తుకు వస్తుం దన్నారు. ఈ సమయంలో తెలంగాణకు 18 టీ ఎంసీల నీరు వాడకుంటే ఏపీ ప్రభుత్వం 100 టీఎంసీల నీటిని ఎత్తుకెళ్లిపోయారని ఆల వెంక టేశ్వర్‌రెడ్డి అన్నారు. మరోపక్క బీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బస్వ రాజుగౌడ్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నా యకులు మురళీధర్‌గౌడ్‌, నారాయణగౌడ్‌, బాల్‌ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:42 PM