కూలిన చేనేత కార్మికుడి మట్టి ఇల్లు
ABN , Publish Date - May 10 , 2026 | 11:34 PM
చేనేత కార్మికుని మట్టి ఇల్లు(వంటగది) అకస్మా త్తుగా కూలి పడడంతో ఆ సమయంలో అ క్కడ ఎవరూ లేని కారణంగా పెను ప్రమా దం తప్పింది.
- తప్పిన పెను ప్రమాదం
- లక్షన్నర ఆస్తి నష్టం
అమరచింత, మే 10 (ఆంధ్రజ్యోతి) : చేనేత కార్మికుని మట్టి ఇల్లు(వంటగది) అకస్మా త్తుగా కూలి పడడంతో ఆ సమయంలో అ క్కడ ఎవరూ లేని కారణంగా పెను ప్రమా దం తప్పింది. ఈ ఘటన ఆదివారం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమరచింత పట్టణంలోని పదవ వార్డు తిరుమల వీధిలో గల చేనేత కార్మికుడు తిరుమల మధు మట్టి ఇంటి వంట గది ఒక్కసారిగా కూలి పడిపో యింది. ఉదయం 9గంటల ప్రాంతంలో నేత కార్మికుడు మధు భార్య భారతమ్మ వంట గది లో టిఫిన్ తయారు చేసి ఎదురుగా ఉన్న గ దిలో వెళ్తున్న తరుణంలోనే ఒక్కసారిగా మట్టి గది పెద్ద శబ్దంతో కూలి కింద పడిపోయింది. ఆ గదిలో ఉన్న బియ్యం సంచులు, పెద్ద ఫ్రి డ్జ్, సిలిండర్లు, మిక్సి, కుక్కర్, ప్లేట్లు, ఇత్తడి, సిల్వర్ ప్లాస్టిక్ కడవ లు వంట పాత్రలు తదితర సామగ్రి కూలిపడిన మట్టిలో ధ్వంసమయ్యాయి. దీంతో ఆ యజమా నికి లక్షన్నర నష్టం వాటిల్లింది. చేనేత కార్మికుడు మధు పాత ఇంట్లోనే అనేక సంవత్సరాలుగా ఉం టున్నాడు. గత కొద్ది రోజుల క్రితం పట్టు వస్త్రాలు నేయడానికి వర్షపు నీరు పడకుండా ఆ గదికి ఆర్‌సీసీ వేయించగా లోపల ఉన్న వంట గది మాత్రం మట్టి ఇల్లు అలాగే ఉంద నే గదిలో గంట పాటు వంట పని టిఫిన్ చే సి బయటకు ఇలా రాగానే గది పెద్ద శబ్దంతో కుప్పకూలి పడిపోవడంతో చేనేత కార్మికురా లు భారతమ్మ బోధిస్తూ భయంతో చెప్పారు. ఆ సమయంలో పిల్లలు ఎవరూ లోపలికి వెళ్లకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ గో పాల్, మునిసిపల్ సిబ్బంది అక్కడికి చేరు కుని కూలి పడిన ఇంటిని పరిశీలించారు. అ నంతరం పంచనామా చేశారు. ప్రభుత్వపరం గా తమను ఆదుకోవాలని ఇంటి యాజమా నులు నేత కార్మికులు తిరుమల మధు, భార తమ్మ పేర్కొన్నారు.