సీఎం కప్‌తో క్రీడా ప్రతిభను ప్రదర్శించే అవకాశం
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:26 PM
ఔత్సాహిక క్రీడాకారులు సీఎం కప్ ద్వారా తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ అన్నారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, జనవరి 9 (ఆంఽధ్రజ్యోతి): ఔత్సాహిక క్రీడాకారులు సీఎం కప్ ద్వారా తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ అన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో ఇనుమడింపజేయాలని కోరారు. శుక్రవారం సీఎం కప్-2025 పోస్టర్లను కలెక్టర్ తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లాకేంద్రంతో పాటు మం డల కేంద్రాల్లో టార్చ్ ర్యాలీ ఉంటుందన్నారు. మండలాల విద్యాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, క్రీడాసంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపా ధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొనాలన్నారు. 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహించి, మండల స్ధాయికి క్రీడాకారుల ఎంపిక, మండల స్థాయిలో 28 నుంచి 31 వరకు, నియోజకవర్గ స్థాయి లో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వర కు పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో కృష్ణయ్య, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు, అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు బీసన్న, ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి విజయ్, బహీర్ అహ్మద్ ఉన్నారు.