Share News

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:08 AM

ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కేం ద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తోందని మహబూబ్‌నగర్‌ డీసీ సీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ విమర్శిం చారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీనామా చేయాలి
ధర్నాలో ప్రసంగిస్తున్న డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌

  • మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌

  • వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ ధర్నా

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 6 (ఆంధ్ర జ్యోతి) : ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కేం ద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తోందని మహబూబ్‌నగర్‌ డీసీ సీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ విమర్శిం చారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డి మాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిర క్షించాలంటే ఆయనను బాధ్యతల నుంచి తప్పించాలన్నారు. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీ ఎం, సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వర్యంలో నగరం లోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్‌ ముదిరాజ్‌తో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్‌, సీపీఎం జిల్లా కార్య దర్శి రాములు, సీపీఐ (ఎంఎల్‌) నాయకుడు రాంచందర్‌ మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ ‘సర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లను తొలగించిందని ఆరోపించారు. అర్హులైన ఓటర్ల పేర్లను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు చోరీ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రజాస్వా మికవాదులంతా ఒక్కటై పోరాడాల్సిన అవ సరం ఉందన్నారు. ఆయనను తొలగించే వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసా గిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు దేశపౌరులంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. లేకపోతే ఓటు చోరీపై జెన్‌జీ తరహా ఉద్యమం వస్తుందన్నారు. ధర్నాలో ముడా చైర్మన్‌ ల క్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహ్మారెడ్డి, టీపీసీసీ అధికార ప్ర తినిధి జహీర్‌అక్తర్‌, నాయకులు రాజేందర్‌ రెడ్డి, గోనెల శ్రీనివాసులు, సీజే బెనహర్‌, వీ కృష్ణయ్య, సాయిబాబా, మినాజుద్దీన్‌, రాములుయాదవ్‌, పాసుల రాజు, అవేజ్‌, వామపక్ష పార్టీల నాయకులు కిల్లెగోపాల్‌, ఎన్‌ కురుమూర్తి, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:08 AM