కేంద్ర ప్రభుత్వ తీరు సరికాదు
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:23 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బుధవారం పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేప ట్టారు.
పెబ్బేరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ బుధవారం పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేప ట్టారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని తెలిపా రు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేం దుకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుండి పోరా టం చేస్తుందని స్పష్టం చేశారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
గోపాల్‌పేట: నీట్ పేపర్ లీక్ చేసి విద్యా ర్థుల జీవితాలతో ఆడుకున్న కేంద్ర ప్రభుత్వ వి ద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు పందెం సుఖేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంకి వెంకటేశ్ అన్నారు. బుధవారం మండలంలోని ఏదుల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు చీరకపల్లి రవి, జమ్మి మల్లేశ్, జానికీరామ్, రమేశ్, శేషిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.