Share News

సీఈసీ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:43 PM

ఓట్ల సవరణలో అక్రమాలకు పాల్పడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ చి క్కుడు వంశీకృష్ణ డిమాడ్‌ చేశారు.

సీఈసీ రాజీనామా చేయాలి
అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

- డీసీసీ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): ఓట్ల సవరణలో అక్రమాలకు పాల్పడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ చి క్కుడు వంశీకృష్ణ డిమాడ్‌ చేశారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి భారీర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటరు జాబితా సవర ణ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులను కాలరాయడం కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటర్ల జాబితాలో పారదర్శకత అవసర మని తెలిపారు. ఫారం-6ప్రక్రియలోని లోపాలను తక్షణమే సరిచేయా లని అన్నారు. ఓటు హక్కుకు భంగం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు శివచరణ్‌రెడి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:43 PM