Share News

ప్రారంభమైన పది మూల్యాంకనం

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:27 PM

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేం ద్రంలో ని మహబూబ్‌నగ ర్‌ గ్రామర్‌ స్కూల్‌లో బుఽధవారం మఽఽధ్యా హ్నం నుంచి ప్రారంభమైంది.

 ప్రారంభమైన పది మూల్యాంకనం
మూల్యాంకనాన్ని పరిశీలిస్తున్న డీఈవో ప్రవీణ్‌కుమార్‌

- పర్యవేక్షించిన డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్యావి భాగం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేం ద్రంలో ని మహబూబ్‌నగ ర్‌ గ్రామర్‌ స్కూల్‌లో బుఽధవారం మఽఽధ్యా హ్నం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి ఉపా ధ్యాయు లు ఉత్తర్వులతో వచ్చి మూల్యాం కన కేంద్రంలోనే రిపోర్టు చే శా రు. మూడు విడతల్లో నిర్వహించే స్పాట్‌ మొదటి విడతలో తెలుగు, ఇంగ్లీష్‌, గణితం సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంక నం ప్రారంభం అయ్యింది. మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేటకు చెం దిన ఉపాధ్యాయులు స్పాట్‌కు హాజరయ్యా రు. స్పాట్‌ కేంద్రాన్ని డీఈవో క్యాంఫు ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, అసిస్టెంట్‌ క్యాంప్‌ అధికారి మొరజుల్లాఖాన్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా అధికారి కమలాకర్‌వర్మ తదితరులు ప ర్యవేక్షించారు. స్పాట్‌ మొదటి రోజు కావడం తో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూ ల్యాంకనం ప్రారంభమైంది.

తెలుగు ఉపాధ్యాయుల కొరత...

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంక నానికి సంబంధించి తెలుగు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. మూడు జిల్లాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులకు స్పాట్‌ వ్యాల్యుయే షన్‌ చేసేందుకు ఇంకా 20 మంది అవసరం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా స్పెషల్‌ అసిస్టెంట్‌ కొరత కూడా ఉంది. 80 మంది ఉ పాధ్యాయులకు ఉత్తుర్వులు పంపారు. మొ త్తం మొదటి రోజు 373 మంది మాత్రమే హాజరయ్యారు.

మూల్యాంకనం చేసేందుకు ఇష్టపడని ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులు పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేందుకు ఇష్టపడ టం లేదు. చాలామంది ఉపాధ్యాయులకు వ చ్చిన ఉత్తర్వులను క్యాన్సల్‌ చేయించుకునేం దు పైరవీలు చేసుకుంటున్నారు. ఇందుకు కా రణం లేకపోలేదు. గత ఏడాదిలో చేసిన మూల్యాంకనం డబ్బులు ఇప్పటికీ రాలేదు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్వక్తం చేస్తున్నారు. గత ఏడాదిలో స్పాట్‌ వాల్యుయేషన్‌ చేసిన డబ్బులు రాకపో డం, ఎండల తీవ్రత తదితర కారణాల వల్ల చాలామంది ఉపాధ్యాయులు అనాసక్తి చూ పుతున్నారు.

మొదటి రోజు 6,982 జవాబు పత్రాల మూల్యాంకనం

పదో తరగతి జవాబు పత్రాల మూ ల్యాంకనంలో భాగంగా జిల్లా 2,09,687 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయ్యా ల్పి ఉంది. మొదటి రోజు 6,982 జవాబు పత్రాలు మూల్యాంకనం చేశారు. మూ ల్యాంకనంలో 47 మంది సీఈలు, 293 మంది ఏఈలు, 33 మంది స్పెషల్‌ అసి స్టెంట్స్‌ పాల్గొన్నారు. తెలుగు ఉపాధ్యా యులకు సంబంధించి నారాయణ పేట, గద్వాల నుంచి రప్పించికుంటున్నట్లు డీ ఈవో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మొదటి రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమైం ది. గురువారం ఉదయం నుంచే కొన సాగుతుందని తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 11:27 PM